Breaking News

నిజామాబాద్‌లో నూతన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌కు ఘన సన్మానం.

నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.

ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఇటీవల పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించిన డి. అరుణ్ కుమార్ ను టీఎన్జీఓఎస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ ప్రతినిధులు, శాఖా సిబ్బంది ఘనంగా సన్మానించారు.

నిజామాబాద్‌లోని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ కేంద్ర ఉపాధ్యక్షులు కె. అరుణ్ కుమార్, డీపీఈఓ (DPEO) కార్యాలయ ఏఏఓ వి. నరసయ్య పాల్గొని నూతన అసిస్టెంట్ కమిషనర్‌కు పూలగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శాఖ పరిపాలన, విధుల నిర్వహణ, లక్ష్యాల సాధనపై చర్చ జరిగింది. శాఖ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది అంతా సమిష్టిగా పనిచేస్తూ నూతన అధికారికి పూర్తి సహకారం అందిస్తామని ప్రతినిధులు హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఫోరమ్ మాజీ కార్యదర్శి ఎం. శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్లు ఎం. దేవేందర్, శేఖర్ రాజ్, రిజ్వాన్, సభ్యులు రాజు, నాగరాజు, రాణా, సబా, సాయిబాబా, సృజన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *