Breaking News

అభిమానంతో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర

మద్నూర్ మీదుగా తమిళనాడుకు వెళ్తున్న మహారాష్ట్ర అభిమాని యాదవ్ హెగ్డోలే మద్నూర్ ఆగస్టు 11: (E6 tv NEWS: M. మస్నాజీ).తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ దళపతి పట్ల ఉన్న అభిమానంతో మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని సుమారు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ మండలం షెల్గవ్ గ్రామానికి చెందిన యాదవ్ హెగ్డోలే తన అభిమాన నాయకుడిని స్వయంగా కలిసి అభినందించాలనే ఆశయంతో పాదయాత్రగా తమిళనాడు బయలుదేరారు. విజయ్ దళపతి ముఖ్యమంత్రి…

Read More

మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. 40 కేసులు నమోదు

20 మంది అరెస్ట్.. గుడుంబా, అక్రమ మద్యం సీజ్రాబోయే వారం స్పెషల్ డ్రైవ్: DPEO అరుణ్ కుమార్ నిజామాబాద్, ఆగస్టు 11: (E6 tv NEWS: శివ ఠాకూర్).మత్తు పదార్థాల వినియోగం, అక్రమ విక్రయాలు, రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు DPEO పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్, మోర్తాడ్ ప్రాంతాలతో పాటు DTF, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 40 కేసులు నమోదు…

Read More

హక్కుల పరిరక్షణకు దళితులంతా ఏకం కావాలి: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ఆదిలాబాద్: పాలకుల “విభజించు – పాలించు” కుట్రలను తిప్పికొడుతూ, తమ రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి దళితులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని మానకొండూరు ఎమ్మెల్యే, టిపిసిసి (TPCC) ఎస్సీ సెల్ ఛైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. వర్గాల మధ్య వైషమ్యాలు రేపే శక్తులకు, దళిత మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా మరియు భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ హక్కులను కాపాడుకోవడానికి దళితులు గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో సోమవారం జరిగిన ఓ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు….

Read More

భీంగల్‌లో అంగన్వాడీ ఉద్యోగుల ర్యాలీ.. రాస్తారోకో

భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్) దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాల పిలుపులో భాగంగా భీంగల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కైరిదేవ గంగు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల గోవర్ధన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర…

Read More

ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీ ప్రారంభం

నిర్మల్ ఆగస్టు 10: E6 tv NEWS(Md. ఆమీనుద్దీన్). నిర్మల్ పట్టణంలో ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందించడంలో రక్త పరీక్షలు ఎంతో కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందేందుకు వైద్యుల సూచనల మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముందస్తు పరీక్షల…

Read More

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

ఏర్గట్ల మండల కేంద్రంలో పలు కుటుంబాలకు పరామర్శ ఏర్గట్ల ఆగస్టు 9: E6 tv NEWS (T. గంగాధర్). బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు గొల్ల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన నివాసానికి వెళ్లిన ముత్యాల సునీల్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని…

Read More

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి భారీగా తరలిరావాలి

మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).మద్నూర్ మండల ప్రజలందరికీ పెద్ద ఎక్వొర సర్పంచ్ సోమర్ మహేష్ ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారి కుమార్తె వివాహ వేడుక ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు. కందర్‌పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మద్నూర్ మండల ప్రజలు పెద్ద…

Read More

అన్నాభావు సాథే విగ్రహా ఆవిష్కరణ  కార్యక్రమ ఏర్పాట్లపై మాదిగ నాయకుల చర్చ

మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ)హాసన్ టాక్లి గ్రామంలో ఈ నెల 30వ తేదీన సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాథే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాదిగ జాతి ముద్దుబిడ్డ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరుకానున్న నేపథ్యంలో ఉమ్మడి మద్నూర్ మండలానికి చెందిన మాదిగ నాయకులు హాసన్ టాక్లి గ్రామాన్ని సందర్శించి కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, గ్రామస్థులతో సమావేశమై విగ్రహావిష్కరణ, సభ,…

Read More

టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా గులని సాయిలుకు ఘన సన్మానం

బిచ్కుంద, ఆగస్టు 9: (E6 tv NEWS ప్రతినిధి).టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన గులని సాయిలును బిచ్కుందలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన గులని సాయిలు టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం సామాజిక వర్గానికి మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదపడుతుందని…

Read More

ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం ఇందూరు యువత అదృష్టం: సీపీ సాయి చైతన్య

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి 70కి పైగా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు.. 2,500 మందికి పైగా అభ్యర్థుల హాజరు నిజామాబాద్, ఆగస్టు 9: (E6 tv NEWS, శివ ఠాకూర్).ప్రజాభివృద్ధితో పాటు యువత భవిష్యత్తు కోసం కృషి చేసే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్…

Read More