Breaking News

మంత్రి సీతక్కకు ఘన సన్మానం..

గ్రామపంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు గాను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు సౌధాని భువనేశ్వర్ (భువన్న) యాదవ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది సర్పంచులు, కార్యదర్శులు ప్రజా భవన్‌కు తరలివచ్చి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు పూలదండలు, శాలువాలు, బొకేలతో పాటు భారీ గజమాలతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకాలం గ్రామపంచాయతీల సొంత ఆదాయం…

Read More

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు షాద్‌నగర్ ఎమ్మెల్యే వివరణ..

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరణ ఇచ్చారు. ఒకరి మరణాన్ని లేదా చావును కోరుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అలాగే మహిళా మంత్రులపై బీఆర్‌ఎస్ నాయకులు వాడుతున్న అసభ్యకర, కుల ఆధారిత పదజాలాన్ని శంకర్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని ఉద్దేశించి నీచమైన భాష…

Read More

సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ డిమాండ్!

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన వీరుల బలిదానాలను గుర్తించి, సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా నిర్వహించాలని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ చర్యతోనే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందని గుర్తుచేశారు. ఈ పోరాటంలో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ…

Read More

రైతులకు 18 గంటల విద్యుత్ ఇవ్వాలి: ఎస్‌ఈకి బీజేపీ వినతిపత్రం!

నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పంట పొలాలు కీలకమైన పొట్ట దశకు చేరుకున్న సమయంలో విద్యుత్ కోతలు విధించడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగవుతున్న సుమారు…

Read More

వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి….AVIS హాస్పిటల్‌లో విషాదం..

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏవిస్ హాస్పిటల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) సమస్యకు శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ.. సర్జరీ జరిగిన మరుసటి రోజే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడ రాంపల్లికి చెందిన మంజుల అనే మహిళ వెరికోస్ వెయిన్స్ చికిత్స కోసం జూబ్లీహిల్స్‌లోని ఏవిస్ హాస్పిటల్‌లో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స పూర్తయిన మరుసటి రోజే పరిస్థితి విషమించి మృతి చెందారు. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం వల్లే మంజుల…

Read More

RTC ఛార్జీల మోత: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం!

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని విమర్శించింది. హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్లే ఏసీ బస్సు ఛార్జీని ఉదాహరణగా చూపుతూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆగస్టు 20న రూ.410గా ఉన్న ఈ బస్సు ఛార్జీ, సెప్టెంబర్ 11 నాటికి రూ.570కి చేరిందని ఆరోపించారు….

Read More

దళితులపై వేధింపులు: బిఆర్‌ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ భారీ ర్యాలీ!

దళిత వర్గాలను అవమానిస్తున్నారంటూ బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్, బిజెపిల దళిత వ్యతిరేక చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించాయి. పాత బస్టాండ్ సెంటర్ లోని సంజీవరెడ్డి భవన్ (డిసిసి కార్యాలయం) నుంచి జిల్లా పరిషత్ కార్యాలయ సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వరకు 1,000 మందికి పైగా పార్టీ కార్యకర్తలు జెండాలు చేతబూని, రెండు…

Read More

తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను వేధించొద్దు

తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను వేధించొద్దు మిల్లింగ్ ఛార్జీ క్వింటాల్‌కు రూ.150కు పెంచాలి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలినిజామాబాద్‌లో రైస్ మిల్లర్ల ధర్నా నిజామాబాద్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: శివ ఠాకూర్).తనిఖీల పేరుతో నిజాయితీగా పనిచేస్తున్న రైస్ మిల్లర్లను వేధించవద్దని నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ది నిజామాబాద్ డిస్ట్రిక్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ ధర్నాచౌక్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో షార్ట్ సర్క్యూట్

తప్పిన పెను ప్రమాదం.. పలు రికార్డులు, ఫర్నిచర్ దగ్ధం ఇల్లెందు, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. బస్టాండ్ ఆవరణలోని కంట్రోలర్ గదిలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. అయితే ఘటన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కంట్రోలర్ గదిలో ఉన్న పలు రికార్డులు, ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది….

Read More

భీంగల్ కొత్త బస్టాండ్‌లో కంట్రోలర్ లేక ప్రయాణికుల ఇబ్బందులు

బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉన్నా పట్టించుకోని ఆర్టీసీ అధికారులు సమయాలు తెలియక ప్రయాణికుల అవస్థలు భీంగల్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్ పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో కంట్రోలర్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌లో రోజూ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, బస్సుల సమయాలు, రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు కంట్రోలర్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. భీంగల్ కొత్త బస్టాండ్ నుంచి వేల్పూర్,…

Read More