Breaking News

రాయిదుర్గం భూముల వేలం రద్దు చేయాలి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు డిమాండ్

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని రాయిదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో ఉన్న 10.63 ఎకరాల భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా ఈ నెల 17, 21 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ఈ భూముల వేలం వెనుక తీవ్ర…

Read More

కేబీఆర్ పార్క్ వద్ద ఆగస్టు 18 నుండి కొత్త ‘వన్-వే’ ట్రాఫిక్ నిబంధనలు: వాకర్లకు సీపీ విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని ప్రముఖ కె.బి.ఆర్ పార్క్ (KBR Park) పరిసర ప్రాంతాల్లో ఈ నెల 18 (ఆగస్టు 18) నుంచి అమలు చేయనున్న సరికొత్త వన్-వే (One-Way) ట్రాఫిక్ నిబంధనలపై నగర ట్రాఫిక్ పోలీసులు ఉదయం వాకింగ్ వచ్చే ప్రజలతో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్, డీసీపీ ట్రాఫిక్-II కాజల్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు శుక్రవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద వాకర్లతో మాట్లాడి, రాబోయే ట్రాఫిక్ మార్పుల గురించి…

Read More

హల్ద్వానీ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో పాదయాత్ర–సత్యాగ్రహం

కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి) హల్ద్వానీలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన ఘటనను నిరసిస్తూ ఆగస్టు 14న కామారెడ్డి జిల్లాలో జిల్లా స్థాయి పాదయాత్ర, సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు సంఘీభావంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, అనుబంధ సంఘాలు, విభాగాల…

Read More

గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరు మహిళలు మృతిమరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ నిజామాబాద్, ఆగస్టు 13: (E6 tv NEWS, శివ ఠాకూర్). ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి…

Read More

యువతకు ఉపాధి, స్కిల్లింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం-ఫౌండ్‌ఇట్ (foundit) ఒప్పందం

తెలంగాణ రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి (Skilling), ఉద్యోగావకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ప్రముఖ జాబ్ ప్రాసెసింగ్, టాలెంట్ ప్లాట్‌ఫామ్ ‘ఫౌండ్‌ఇట్’ (foundit) మధ్య గురువారం అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా కలిగే ప్రయోజనాలు: అధికారుల స్పందన:

Read More

ఏఐజి ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లలోకి ‘డిజిటల్ రివ్యూ’ విధానం.. సర్జరీల రికార్డింగ్, పర్యవేక్షణ, శిక్షణ కోసం సరికొత్త పరిజ్ఞానం

ప్రముఖ వైద్య సంస్థ ఏఐజి హాస్పిటల్స్ (AIG Hospitals) శస్త్రచికిత్సా రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. ఆపరేషన్ థియేటర్లలో జరిగే సర్జరీలను సురక్షితంగా రికార్డ్ చేయడం, వాటిపై సమీక్షలు జరపడం, వైద్యులకు మెరుగైన శిక్షణ అందించడం కోసం ‘జాన్సన్ అండ్ జాన్సన్’ (Johnson & Johnson) సంస్థకు చెందిన ‘పాలిఫోనిక్ సర్జరీ’ (Polyphonic Surgery) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం చేసుకుంది. ఆసియా-పసిఫిక్ రీజియన్ తో పాటు భారతదేశంలో ఈ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్న తొలి…

Read More

ఆర్మీ నియామకాల కోసం సైన్యంతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: భారత సైన్యంలో చేరేందుకు తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ఆర్మీ అధికారులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం తెలిపారు. స్థానిక యువతలో అవగాహన పెంచి, ఆర్మీ నియామకాల్లో వారు అర్హత సాధించేలా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆయన సైనిక అధికారులకు విజ్ఞప్తి చేశారు. భారత సైనిక దళాల సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C) లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్…

Read More

నిరుపేద కుటుంబానికి అండగా జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్

జమ్మికుంట, ఆగస్టు 12: (E6 tv NEWS: ప్రతినిధి). ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సీర్ల అనిత రాణి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె అంతిమయాత్రలో కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ పాల్గొన్నారు.హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 30 సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్న సీర్ల అనిత రాణి ప్రైవేట్ నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని…

Read More

దివ్యాంగుల సంక్షేమంపై కేంద్ర మంత్రితో ఎంపీ అర్వింద్ భేటీ

న్యూఢిల్లీ ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి).  ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్‌ను న్యూఢిల్లీలో కలిశారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు,…

Read More

బిచ్చుకుంద డిగ్రీ కళాశాలలో సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం

బిచ్చుకుంద, ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). బిచ్చుకుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ప్రేమ, మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు తదితర సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, బిచ్చుకుంద ఎస్‌ఐ జి. రాజు సూచనలతో ఏఎస్ఐ డి. దేవరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్…

Read More