మద్నూర్, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి).
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాస్ పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి పుష్పాలు, పండ్లు, నైవేద్యాలను సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి గణేశుడికి హారతి ఇచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ పటేల్ కుటుంబంలో భక్తి వాతావరణం నెలకొంది. విఘ్నాలను తొలగించి కుటుంబ సభ్యులకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని గణనాథుడిని ప్రార్థించారు. పిల్లలు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను కుటుంబ సభ్యులంతా కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక భావనతో పాటు కుటుంబ ఐక్యత, సంప్రదాయాల పట్ల గౌరవం మరింత పెంపొందుతుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

