Breaking News

గాంధీ భవన్‌కు తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు..

హైదరాబాద్‌లోని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ మంగళవారం కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల రాకతో కోలాహలంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు అభినందనలు తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

ఉదయం నుంచే గాంధీ భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మహేష్ కుమార్ గౌడ్‌ను నేరుగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలను, పార్టీ సంస్థాగత బలోపేతానికి చేపట్టిన చర్యలను పలువురు సీనియర్ నాయకులు కొనియాడారు.

తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ మహేష్ కుమార్ గౌడ్ ఆప్యాయంగా పలకరించి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, పార్టీ యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా తరలివచ్చిన ముఖ్య నేతల రాకతో రోజంతా గాంధీ భవన్ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *