Breaking News

హైదరాబాద్‌లో ఆస్తి వివాదం: వదినపై హత్యాయత్నానికి దిగిన మరిది, ఇద్దరు అనుచరులతో సహా అరెస్ట్!

హైదరాబాద్: కుటుంబ ఆస్తి తగదాల కారణంతో వదినపై అత్యంత ఘాతుకానికి ఒడిగట్టి, ఆమెను హత్య చేయడానికి యత్నించిన ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు అనుచరులను టాప్‌చబుత్రా పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే:

ఆసిఫ్‌నగర్‌కు చెందిన ముహమ్మద్ దస్తగిరి షరీఫ్ అలియాస్ పప్పు తన వదిన షమీమ్ బేగమ్‌తో కొంతకాలంగా ఆస్తి తగాదాలు, కుటుంబ విభేదాలతో కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను అంతమొందించేందుకు తన అనుచరులైన ముహమ్మద్ గులామ్ నబీ ఖురేషీ, ముహమ్మద్ ఉస్మాన్‌లతో కలిసి ప్లాన్ వేశాడు.

జులై 27న నిందితులు ముగ్గురూ ద్విచక్రవాహనంపై దాబీపురాలోని సమోసా గల్లీలో ఉన్న షమీమ్ బేగం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె మెడపై దాడి చేశారు. ఆమె భర్త ముహమ్మద్ అజమ్ షరీఫ్ అడ్డుకోబోగా, అతనిపై కూడా దాడి చేసి నిరోధించారు.

తీవ్ర గాయాల పాలైన షమీమ్ బేగం రక్షణ కోసం పొరుగు భవనం వైపు పరుగులు తీయగా, నిందితులు ఆమెను తరుముకుంటూ వెళ్లి పొట్ట భాగంలో కత్తితో తీవ్రంగా పొడిచారు. స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడటంతో నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు.

గాయపడిన షమీమ్ బేగమ్‌ను వెంటనే ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల చర్యలు:

బాధితురాలి ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 145/2026 కింద కేసు నమోదు చేసిన టాప్‌చబుత్రా పోలీసులు, కుల్సుంపురా ఏసీపీ వి. తిరుపతి మరియు సీఐ జి. బాలకృష్ణ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *