Breaking News

వినాయకుడిని దర్శించుకున్న గుండు రవికుమార్ కుటుంబ సభ్యులు

పాల్వంచ,సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి).
గాంధీనగర్ 44వ డివిజన్ కాంగ్రెస్ ఇంచార్జ్ గుండు రవికుమార్ (రవన్న) తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా కేసుపాక లక్ష్మి, కోయిల, పద్మ, దుర్గ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి గణనాథుడికి పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *