నిజామాబాద్:, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి).
నిజామాబాద్‌లోని హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్ను ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ పరామర్శించారు.
అనంతరం వైద్యులతో మాట్లాడిన వారు దిగంబర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దిగంబర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆకాంక్షించారు.

