178.5 కిలోల కాపర్ వైర్ స్వాధీనం.. విలువ రూ.3.57 లక్షలు
టేకులపల్లి, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ వైర్‌ను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.నిందితుల వద్ద నుంచి 178.5 కిలోల కాపర్ వైర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 లక్షల 57 వేలుగా పోలీసులు తెలిపారు. చోరీకి ఉపయోగించిన ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు.
టేకులపల్లి మండల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ ముఠాలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐ తిరుపతి పాల్గొన్నారు.


