బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ పెట్టిన కొత్త రూల్స్ కారణంగా ఈసారి ఏకంగా 11 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ముంగిట నిలిచారు. సాధారణ నామినేషన్ పద్ధతికి భిన్నంగా నిర్వహించిన ‘రోప్ టాస్క్’లో ఓడిపోయిన వారు నేరుగా నామినేట్ కాగా.. షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రాంప్రసాద్, ముఖేష్, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్‌లు నామినేషన్ లిస్టులోకి చేరారు. అమన్, వంశీ, నరేష్‌లకు మాత్రమే నామినేషన్ నుంచి మినహాయింపు లభించింది.
అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం, మొదటి స్థానం కోసం త్రిగుణ్, రోహిత్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. త్రిగుణ్ 29.30% ఓట్లతో స్వల్ప ఆధిక్యంలో ఉండగా, రోహిత్ 29.18% ఓట్లతో అత్యంత సమీపంలో రెండో స్థానంలో ఉన్నాడు. ముఖేష్ గౌడ (12.84%), రాంప్రసాద్ (10.21%) తదుపరి స్థానాల్లో ఉన్నారు. కాగా ఝాన్సీ, సృష్టి, వర్షిణి, కృష్ణుడు తక్కువ ఓట్లతో ‘డేంజర్ జోన్’లో కొట్టుమిట్టాడుతున్నారు. ఓటింగ్ ముగిసేసరికి ఈ ట్రెండ్స్‌లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.

