Breaking News

బిందెల కాలనీ భూ సమస్యపై 17న ప్రజా ధర్నా

అనంతపురం, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి).

బిందెల కాలనీలోని సర్వే నంబర్లు 189/3, 75లో ఉన్న భూముల సమస్యపై దాదాపు 22 నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు ప్రజా ఉద్యమ నేత సాకే గోవింద్ తెలిపారు.

ఉదయం 11 గంటలకు అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పేదల స్థలాలను కాపాడాలని, అక్రమ జోక్యాలను అడ్డుకోవాలని, వాస్తవ రికార్డులను పరిశీలించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు.

ఈ ధర్నాలో అనంతపురం ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సాకే గోవింద్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *