Breaking News

సమ్మెకు సిద్ధమైన పవర్ జేఏసీ

పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి)

విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిగి 15 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంపై పవర్ జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

విద్యుత్ యాజమాన్యాల నుంచి సరైన స్పందన లేకపోవడంతో సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు పవర్ జేఏసీ వెల్లడించింది. సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని 1104 కార్యాలయంలో జరిగిన విద్యుత్ జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ సమావేశంలో పవర్ ఎంప్లాయీస్ జేఏసీ, ఆర్టీసీన్ జేఏసీ, పెన్షనర్ జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల పరిష్కారంపై యాజమాన్యాలు స్పందించకపోతే తదుపరి కార్యాచరణను కొనసాగిస్తామని జేఏసీ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *