Breaking News

చేయూత పింఛన్ల దరఖాస్తుల వెరిఫికేషన్ పరిశీలన

భీంగల్, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి)

భీంగల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో నూతనంగా చేయూత పథకం కింద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ పరిశీలించారు.

ఈ సందర్భంగా వార్డుల్లో జరుగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన కమిషనర్.. దరఖాస్తుదారుల వివరాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని వెరిఫికేషన్ అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని గుర్తించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *