Breaking News

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 25 ఈ-బస్సులు ప్రారంభం:తిరుమల

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళాన్ని అందజేసింది. తిరుమల కొండల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో 25 విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులతో పాటు ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను టీటీడీకి విరాళంగా అందించింది. ఈ నూతన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో ఘనంగా ప్రారంభించి జెండా ఊపి ప్రారంభించారు.

త్వరలో ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది. జూన్ 2026లో తిరుమలను దర్శించుకున్న సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంద్ అంబానీ చేసిన ప్రకటనకు కట్టుబడి ఈ బస్సులను అందించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో పాటు జియో-బీపీ (Jio-bp) సాంకేతిక మద్దతుతో ఈ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్ల మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. తిరుమల పవిత్రతను, ఘనమైన జీవవైవిధ్యాన్ని కాపాడుతూ భక్తులకు కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనంద్ అంబానీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *