Breaking News

నాయి బ్రాహ్మణులకు క్షవరవృత్తిపై పేటెంట్ హక్కు కల్పించాలి

వరల్డ్ బార్బర్స్ డే లో నాయి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్

పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). నాయి బ్రాహ్మణులు తరతరాలుగా కొనసాగిస్తున్న క్షవరవృత్తిపై వారికి పేటెంట్ హక్కు కల్పించాలని తెలంగాణ నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు కొమరవెల్లి రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పాల్వంచ పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం కేటీపీఎస్ బీసీ అసోసియేషన్ హాల్‌లో వరల్డ్ బార్బర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం పట్టణ అధ్యక్షుడు ముప్పర్ల పుల్లారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొమరవెల్లి రవీందర్ హాజరయ్యారు.ముందుగా నాయి బ్రాహ్మణుల మూలపురుషుడు శ్రీ ధన్వంతరి వైద్య నాయి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి, నాయి బ్రాహ్మణ జెండాను జిల్లా గౌరవ అధ్యక్షులు కొమరవెల్లి రవీందర్ ఎగురవేశారు. కార్యక్రమంలో సుమారు వంద మంది నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం రుణాలు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. సంప్రదాయ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నాయి బ్రాహ్మణుల ఉపాధికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పట్టణాల్లో కార్పొరేట్ సెలూన్లు, బ్యూటీ పార్లర్ల పెరుగుదలతో సంప్రదాయ వృత్తిని ఆధారంగా చేసుకున్న నాయి బ్రాహ్మణుల ఉపాధిపై ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు పుట్టుక నుంచి చావు వరకు వివిధ రకాల సేవలు అందిస్తున్న నాయి బ్రాహ్మణులకు క్షవరవృత్తిపై పేటెంట్ హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పట్టణ అధ్యక్షుడు ముప్పర్ల పుల్లారావు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంతో ముందుకు సాగుతూ సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ సలహాదారు దేవరకొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జంపాల వెంకన్న, కోశాధికారి సోములపల్లి బాలకృష్ణతో పాటు శ్రీరాముల ఉదయ్, శ్రీరాముల ఉపేందర్, చందర్లపాటి సైదులు, మురళి, నేలపట్ల శ్రీను, కంది శ్రీను, అవదుర్తి ప్రసాద్, సీహెచ్ వెంకటేశ్వర్లు, సీహెచ్ చైతన్య, సింగారపు శ్రీను, రాజు, డి. రామకృష్ణ, ఉపేందర్, వీరభద్రం, మణికంఠ, సీహెచ్ మోహన్, ఉప్పెర్ల రాంప్రసాద్, సురేష్, విజయ్, పండు, నరసింహారావు, సాయి, మహేష్, కృష్ణ, గోపి, అశోక్, నాగేందర్, కిరణ్, లక్ష్మణ్, జంపాల జంపన్న, సాయి వంశీ, ఎస్. శ్రీను, సీహెచ్ రామారావు, డి. రామారావు, వెంకన్న, సైదులు, పి. వినయ్, బొమ్మకంటి వెంకన్న, శ్రీపతి కృష్ణ, శ్రీను, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *