మద్నూర్, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి)
భార్యతో గొడవ కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 112కు సమాచారం అందించిన వ్యక్తికి పోలీసులు తక్షణ స్పందించి మనోధైర్యం కల్పించారు.
డోంగ్లి మండలం మోఘా గ్రామానికి చెందిన ధన్నూరే హుల్లప్ప (35) భార్యతో గొడవ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 112కు కాల్ చేశాడు. సమాచారం అందుకున్న మద్నూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు చ. విఠల్ (PC 2529), జి. శ్రావణ్ (PC 2916) వెంటనే స్పందించారు.హుల్లప్పతో మాట్లాడి ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని సూచిస్తూ మనోధైర్యం కల్పించారు. కుటుంబ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తగిన కౌన్సెలింగ్ ఇచ్చారు. డయల్ 112కు వచ్చిన సమాచారంపై పోలీసులు వేగంగా స్పందించి వ్యక్తికి సకాలంలో సహాయం అందించడం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

