Breaking News

స్థానిక సంస్థల ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారుల చర్చ

శ్రీ సత్యసాయి జిల్లా, చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియపై అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు.

మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లకు సంబంధించిన అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలను అధికారులు పార్టీల ప్రతినిధులకు వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో బాలకృష్ణుడు, ఈవోఆర్డీ అశోక్ కుమార్ నాయక్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బందితో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీల మధ్య సమన్వయం అవసరమని సమావేశంలో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *