Breaking News

అక్టోబర్ 1 నుంచి టాటా కమర్షియల్ వాహనాల ధరలు పెంపు..

టాటా మోటార్స్ కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి షాక్ ఇచ్చింది. తమ వాణిజ్య (కమర్షియల్) వాహనాల ధరలను 2026 అక్టోబర్ 1 నుంచి గరిష్ఠంగా 1 శాతం వరకు పెంచుతున్నట్లు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ప్రకటనలో వెల్లడించింది. మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈ పెంపు మారనుంది.

ధరల పెంపునకు ప్రధాన కారణాలు:

  • ముడిసరుకు (రాయ్ మెటీరియల్) వ్యయం పెరగడం
  • పెరిగిన ఉత్పత్తి మరియు రవాణా ఖర్చులు
  • సరఫరా వ్యవస్థ (సప్లై చైన్) వ్యయాలు పెరగడం

ఈ ఏడాదిలో రెండోసారి పెంపు: టాటా మోటార్స్ ఈ ఏడాదిలో కమర్షియల్ వాహనాల ధరలను పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు ఏప్రిల్ 1న గరిష్ఠంగా 1.5 శాతం ధరలను పెంచింది. అలాగే ప్యాసింజ‌ర్ వాహనాల విభాగంలో కూడా జులై 1 నుంచి ఐసీఈ (ICE), ఈవీ కార్ల ధరలను 1.5 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే.

కేవలం టాటా మోటార్స్ మాత్రమే కాకుండా.. ఇటీవలి కాలంలో ముడిసరుకు భారంతో మారుతి సుజుకీ, హ్యుందాయ్, ఎంజీ, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు కూడా తమ వాహనాల ధరలను సవరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *