Breaking News

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం

సార్‌తో సర్పంచ్ సాబ్’ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

మద్నూర్, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి)

మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘సార్‌తో సర్పంచ్ సాబ్’ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఎమ్మెల్యేతో కలిసి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి సమస్యలను నేరుగా విన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *