కరీంనగర్ నగర అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. నగరంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న డంపింగ్ యార్డ్ పనులకు మరో వారం రోజుల్లో రూ.16 కోట్ల స్వచ్ఛ భారత్ నిధులతో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) కింద మంజూరైన రూ.840 కోట్లలో మరో రూ.80 కోట్లను ప్రత్యేకంగా ఈ డంపింగ్ యార్డ్ ఆధునీకరణకే వెచ్చిస్తామని వెల్లడించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి నగరంలోని 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రతి డివిజన్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతీ గల్లీలో సీసీ రోడ్లు, మోరీల నిర్మాణం వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కరీంనగర్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక హామీ.. డంపింగ్ యార్డ్ పనులకు త్వరలోనే టెండర్లు!

