Breaking News

రూ. 195 కోట్ల లిక్కర్ స్కామ్: మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ పొడిగింపు!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ ప్రత్యేక కోర్టు ఆయన రిమాండ్‌ను ఈనెల సెప్టెంబరు 25 వరకు పొడిగించింది. పీటీ వారెంట్‌పై ఈడీ అధికారులు గురువారం ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు.

స్కామ్ లోతుపాతులు.. ఈడీ విచారణలో షాకింగ్ నిజాలు:

  • రూ. 195 కోట్ల దోపిడీ: సాధారణంగా కిలోమీటర్‌కు రూ. 13 ఇవ్వాల్సిన రవాణా ఛార్జీలను అక్రమంగా రూ. 35కు పెంచి, ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ. 195.33 కోట్ల నష్టం చేకూర్చారు.
  • హవాలా మార్గంలో రూ. 15 కోట్లు: మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని తన కొడుకు, అనుచరులకు సబ్‌కాంట్రాక్టులు కట్టబెట్టారని.. ప్రతిఫలంగా హవాలా రూపంలో కారుమూరికి రూ. 15 కోట్లు ముట్టినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.
  • రూ. 87.7 కోట్ల ఆస్తులు జప్తు: కేసు విచారణలో భాగంగా కారుమూరి కుటుంబానికి చెందిన రూ. 87.7 కోట్ల విలువున్న ఆస్తులను ఈడీ ఇప్పటికే తాత్కాలికంగా జప్తు చేసింది.

ఈ స్కామ్‌లో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ కుమార్‌తో పాటు ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిలను అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *