తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా డోర్నకల్ ఎమ్మెల్యే రామ్‌చందర్ నాయక్‌కు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. మహబూబాబాద్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్న పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడంతో కారు కేబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యేను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం రామ్‌చందర్ నాయక్ మరొక వాహనంలో మహబూబాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
కారులో పవర్ బ్యాంక్ పేలుడు: తృటిలో తప్పించుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే

