Breaking News

ప్రజా పాలన దినోత్సవం వేళ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్!

హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ‘ప్రజా పాలన దినోత్సవం’ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ఈ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, వందన సమర్పణ స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *