ముధోల్, సెప్టెంబర్ 17: (E6tv NEWS: ప్రతినిధి)
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతంతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ దినేష్ తెలంగాణ రాష్ట్ర విమోచన ఉద్యమ చరిత్ర, ఆనాటి పోరాటాల గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, పాఠశాల కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్, ప్రధానాచార్యులు సారథి రాజు, ఎబీవీపీ కార్యకర్తలు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.




