Breaking News

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆర్‌ఐ మృతి

నిజామాబాద్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి).

నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు.

పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని శుక్రవారం ఉదయం నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చిన ఆర్‌ఐ సతీష్ ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *