Breaking News

నిజామాబాద్ రీజియన్‌ను సందర్శించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు

వాణిజ్య ఆదాయం పెంపునకు అవకాశాల పరిశీలన

నిజామాబాద్, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి).

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలమన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (IT, P, A, M & Legal) ఎం. రాజశేఖర్ నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి. జ్యోతి, నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఎం.వి. రమణ, నిజామాబాద్-2 డిపో మేనేజర్ ఎం. శ్రీనివాస్, పర్సనల్ ఆఫీసర్ టీ. పద్మజ, అకౌంట్స్ ఆఫీసర్ టీ. తుల్య నాయక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బందితో కలిసి నిజామాబాద్, ఆర్మూర్ బస్‌స్టేషన్లను పరిశీలించారు.

బస్‌స్టేషన్లలో అందుబాటులో ఉన్న వాణిజ్య కార్యకలాపాలు, స్థలాలను పరిశీలించి టీజీఎస్‌ఆర్టీసీకి వాణిజ్య ఆదాయాన్ని మరింత పెంచే అవకాశాలపై అధికారులు చర్చించారు. బస్‌స్టేషన్లలో ఉన్న వసతులు, ఇతర అంశాలను పరిశీలిస్తూ ఆదాయ మార్గాలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ పర్యటనలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *