Breaking News

విశాఖలో నీటి కష్టాలు.. పెరిగిన ప్రైవేట్ ట్యాంకర్ల గిరాకీ, అపార్ట్‌మెంట్ ఖర్చులు భారం!

విశాఖపట్నం నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోవడంతో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల ప్రజలు తీవ్ర తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. జీవీఎంసీ (GVMC) సరఫరా చేసే నీటి వేళలను తగ్గించడంతో పాటు, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే వాటర్ ట్యాంకర్లు సమయానికి రాకపోవడంతో నివాసితులు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.

ప్రధాన సమస్యలు & భూగర్భ జలాల గణాంకాలు:

  • అడుగంటిన భూగర్భ జలాలు: విశాఖ జిల్లాలో భూగర్భ జలాలు ఆందోళనకర రీతిలో పడిపోయాయి. 2023లో 7.54 మీటర్లు, 2024లో 7.8 మీటర్లు, 2025లో 7.65 మీటర్లుగా ఉన్న నీటి మట్టం, 2026 నాటికి ఏకంగా 11.51 మీటర్ల లోతుకు పడిపోయింది.
  • బోర్‌వెల్స్ విఫలం: నగరంలోని పలు ప్రాంతాల్లో 500 అడుగుల వరకు బోర్లు వేసినా నీళ్లు పడకపోగా, 800 అడుగుల లోతుకు వెళ్లినా నామమాత్రంగానే నీరు వస్తోంది.
  • జలాశయాల్లో పడిపోయిన మట్టాలు: తాటిపూడి, మేఘాద్రిగెడ్డ, ముదసర్లోవ, గంభీరం, గోస్తనీ వంటి ప్రధాన తాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి.
  • భాధిత ప్రాంతాలు: మహారాణిపేట, సీతమ్మధార, మద్దిలపాలెం, శివాజీపాలెం, ఎండోడ, ఆరిలోవ, పెద రుషికొండ, మర్రిపాలెం, పీఎం పాలెం, మధురవాడ, మిథిలాపురి వుడా కాలనీ, గాజువాక తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
  • పెరిగిన మెయింటెనెన్స్ & అద్దె మార్కెట్‌పై ప్రభావం: ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సి రావడంతో అపార్ట్‌మెంట్లలో మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగాయి. దీనికితోడు రియల్ ఎస్టేట్ రెంటింగ్ మార్కెట్‌లో కూడా భవనంలో నీటి సదుపాయం ఉందో లేదో చూసుకున్నాకే అద్దెకు దిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *