Breaking News

ఇస్కాన్ టెంపుల్ వద్ద ప్రమాదకరంగా మెట్రో పిల్లర్లు.. భయాందోళనలో ప్రయాణికులు!

హైదరాబాద్‌లోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో మెట్రో పిల్లర్ల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కమర్షియల్ నిర్మాణాల కోసం పిల్లర్లకు అతి సమీపంలో భారీగా తవ్వకాలు చేపట్టడంతో చుట్టూ ఉన్న నేల కుంగిపోయి పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో పిల్లర్ల దృఢత్వం దెబ్బతిని భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు, ప్రయాణికులు భయపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, హెచ్‌ఎంఆర్‌ఎల్ మరియు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం వెంటనే స్పందించి సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *