Breaking News

హైదరాబాద్‌ గ్లోబల్ హబ్‌గా మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అభ్యాసం, ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా రంగం, స్కిల్ డెవలప్‌మెంట్, పరిశోధనలలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు.

సోషల్ మీడియా ‘X’ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సందేశం:

“ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోంది. కేవలం పెట్టుబడులు, వ్యాపారాల కోసం మాత్రమే కాదు.. ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించే పరిజ్ఞానం, నైపుణ్యాలు, ప్రతిభ, ఆవిష్కరణల కోసం చూస్తోంది.”

కీలక భేటీలు & నిర్ణయాలు:

  • ప్రముఖ గ్లోబల్ యూనివర్సిటీలతో భాగస్వామ్యం: యూకేకి చెందిన ప్రముఖ బిజినెస్ స్కూళ్లు, విశ్వవిద్యాలయాల ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. డిసెంబరు నుంచి హైదరాబాద్‌లో ‘హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్’ (Harvard Executive Education) ప్రోగ్రామ్‌లు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. వీటితో పాటు ఎంఐటీ (MIT), పర్డ్యూ, యూనివర్సిటీ ఆఫ్ లండన్, వర్జీనియా టెక్, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలతో భాగస్వామ్యాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
  • భారత్ ఫ్యూచర్ సిటీ – ఎడ్యుకేషన్ హబ్: ప్రతిష్టాత్మక ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్, యాంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, గ్లోబల్ రీసెర్చ్ సెంటర్లను సమగ్రంగా అనుసంధానించనున్నట్లు వివరించారు.
  • ఆర్ధిక లక్ష్యాలు: 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.
  • సింగపూర్ కంపెనీలకు ఆహ్వానం: సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని బృందంతో భేటీ అయిన సీఎం, మూసీ పునరుజ్జీవనం మరియు నెట్ జీరో సిటీగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. డిసెంబరులో జరిగే “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్”కు సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానించారు.

హైదరాబాద్‌ను కేవలం పర్యాటక కేంద్రంగా కాకుండా అంతర్జాతీయ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *