మద్నూర్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి)
మేనూర్ గ్రామంలోని యువసేన గణేష్ మండలి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్‌ను ఘనంగా సన్మానించారు. శుక్రవారం గణేష్ మండలి వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ పటేల్ పాల్గొన్నారు.అన్నదాన కార్యక్రమానికి సహకరించిన సర్పంచ్ అశోక్ పటేల్‌కు గణేష్ మండలి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మేనూర్ కెనరా బ్యాంక్ అధికారులు కుమారస్వామి, ఉష, సంతోష్, ఆకాష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా గణేష్ మండలి సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


