మైనార్టీల అభివృద్ధి, హక్కుల సాధన కోసం కృషి చేస్తాం
రుద్రూర్, సెప్టెంబర్ 21;(E6tv NEWS: ప్రతినిధి).
ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం రుద్రూర్ ముస్లిం మైనార్టీ విలేజ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ముల్తాని, ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.
కమిటీ అధ్యక్షుడిగా సయ్యద్ ముల్తాని, ఉపాధ్యక్షులుగా ఇమ్రాన్ ఖురేషి, ఖలీమ్ ఖురేషి, ప్రధాన కార్యదర్శిగా షేక్ సుభాని, సంయుక్త కార్యదర్శిగా ఖాజా కురేషి, కోశాధికారిగా మొహమ్మద్ ఇక్రమ్ ఎన్నికయ్యారు. సభ్యులుగా షేక్ సిరాజ్, షామీర్ ఖురేషి, ఎండి జమీల్, సయ్యద్ రహీం, షేక్ ఇలియాస్, షేక్ జాకీర్లను ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లింలతో పాటు ఇతర మైనార్టీల హక్కుల సాధన, సంక్షేమం, విద్యా, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కమిటీ తరఫున కృషి చేస్తామని తెలిపారు.
మైనార్టీ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి అవకాశాలు అందేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ముల్తాని, ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని పేర్కొన్నారు.

