Breaking News

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఘనంగా నిర్వహణ

నిజామాబాద్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి).

నగరంలోని వినాయక్‌నగర్‌లో గల అమరవీరుల పార్కులో పద్మశాలి కుల పెద్దల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు గుజ్జేటి వెంకట నరసయ్య, ఎనగందుల మురళి, అల్లే నాగభూషణం, అవధూత రాములు, వేముల సూర్య ప్రకాష్, చిలుక కిషన్, మోర భూమన్న, అవధూత విట్టల్, పెంటిరాజు తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను వారు స్మరించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *