శేర్లింగంపల్లి, సెప్టెంబర్ 25(E6TV న్యూస్):
శేర్లింగంపల్లి పరిధిలోని హుడా కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం అన్న సమారాధన (అన్నదానం) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణేష్ మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సుమారు 3,000 మందికి పైగా భక్తులు అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుడి ప్రవీణ్, సునీల్, శేర్లింగంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గణేష్ ఉత్సవాల్లో భాగంగా రేపు గణేష్ నిమజ్జన ఊరేగింపు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఊరేగింపుకు ముందు గణేష్ లడ్డూ వేలం పాట నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.



