Breaking News

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

రుద్రూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి)

రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం ప్రెస్ క్లబ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గౌరవ అధ్యక్షులుగా నూత్‌పల్లి గణేష్, అధ్యక్షులుగా శ్యాంసుందర్ పహాడే, ఉపాధ్యక్షులుగా లాల్ మహమ్మద్, ప్రధాన కార్యదర్శిగా భీమ్‌రావు, సహాయ కార్యదర్శిగా సిరిగాది శేఖర్, కోశాధికారిగా సురాజ్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్యాంసుందర్ పహాడే మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రెస్ క్లబ్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ప్రెస్ క్లబ్‌ను జర్నలిస్టులందరికీ కుటుంబంలా ఉండేలా, సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అశోక్, ఉమాకాంత్, లింగాల శంకర్, షేక్ గౌస్, శేఖర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *