అనంతపురం కలెక్టరేట్ ఎదుట సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల ధర్నా
అనంతపురం, అక్టోబర్ 13(E6tv NEWS).
శ్రీ సత్యసాయి వాటర్ సప్లై కార్మికులకు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు పాల్గొని కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడం వల్ల కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, పెండింగ్ వేతనాల చెల్లింపులో జాప్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, యూనియన్ అధ్యక్షులు మధు, నరేష్, పొన్నూరప్ప, జగదీశ్వర్ రెడ్డి, గోవిందు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. పలువురు వాటర్ సప్లై కార్మికులు ధర్నాలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.


