Breaking News

పూల పండుగతో పాఠశాలలో సందడి

వెంకటాపూర్ అగ్రహారంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన

ఎల్లారెడ్డి, అక్టోబర్ 09 (E6tv News): తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ బతుకమ్మ వేడుకలు ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉపాధ్యాయురాలు పావని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో ఆనందంగా గడిపారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు పావని మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పూల పండుగకు తెలంగాణ సంప్రదాయంలో ఉన్న విశిష్టతను విద్యార్థులకు వివరించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.గ్రామానికి చెందిన మహిళలు సైతం వేడుకల్లో పాల్గొనడంతో పాఠశాల ఆవరణలో సందడి నెలకొంది. విద్యార్థులు సంప్రదాయ పండుగల విశిష్టతను తెలుసుకుంటూ బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *