Thirupathi
రాయలసీమ నిధులపై రోజా ఫైర్..సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
రాయలసీమలో కరవు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్.కే. రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. “కరవు, చంద్రబాబు కవల పిల్లలు” అని వ్యాఖ్యానించిన ఆమె, రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.24,000 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న మాటల్లో నిజం లేదని, ఆ నిధులు ఎక్కడ వెచ్చించారో ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రకటించాలని,…
టీటీడీ అప్డేట్:నేడు రూ.300 దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 12, 13, 14, 19, 20 తేదీలకు సంబంధించిన టికెట్లు అందుబాటులోకి రానుండగా, బ్రహ్మోత్సవాల వేళ స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందస్తుగా బుక్ చేసుకోవాలని దేవస్థానం సూచించింది. భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో దళారులు లేదా అనధికారిక వెబ్సైట్లను నమ్మకుండా కేవలం…
వెంకన్న హుండీ ఆల్‌టైమ్ రికార్డు!
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి హుండీకి కానుకల రూపంలో రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. గత తొమ్మిది నెలల కాలంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఏకంగా రూ. 1,129.04 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో అత్యధికంగా రూ. 140.25 కోట్ల హుండీ ఆదాయం రాగా, ఆగస్టులో రూ. 137.44 కోట్లు, జూన్‌లో రూ. 128.30 కోట్లు మరియు సెప్టెంబర్‌లో రూ. 126.41 కోట్ల రాబడి నమోదైంది….
తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం!
తిరుమల అలిపిరి నడక మార్గంలోని మోకాలిమిట్ట ప్రాంతంలో వేకువజామున రెండు గంటల సమయంలో చిరుతపులి కనిపించడం కలకలం రేపింది. మెట్ల పక్కనే కొంతసేపు సంచరించిన చిరుతను గుర్తించిన టీటీడీ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో నడక మార్గంలో భక్తులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ట్రాప్, సోలార్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు.. నడక మార్గంలో నిఘాను మరింత పెంచారు. భక్తులు ఒంటరిగా కాకుండా…
రాయలసీమ: ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’కు నేడే శ్రీకారం
రాయలసీమను దేశంలోనే ప్రధాన ఫల దిగుబడి, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మదనపల్లెలో రూ.1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’కు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ ప్రాజెక్టు కింద 10 జిల్లాల్లోని 303 మండలాలు, 5,869 గ్రామాలను కలిపి 201 క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల…
రెండు రాష్ట్రాల్లో ‘చెడ్డీ గ్యాంగ్’ చోరీల కలకలం!
తెలుగు రాష్ట్రాల్లో ‘చెడ్డీ గ్యాంగ్’ల సంచారం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లోకి చొరబడిన దుండగులు చోరీకి యత్నించడంతో పాటు, అడ్డుకున్న మహిళపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన మరవక ముందే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శివార్లలోనూ చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. తిరుచానూరు పరిధిలోని కొత్తపాలెం ప్రాంతంలో అర్ధరాత్రి…
తిరుమల శ్రీవారి దర్శనంలో మంత్రి లోకేష్.. వెంట సింగపూర్ మంత్రి!
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, సింగపూర్ కేంద్ర మంత్రి కె. షణ్ముగం మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం తో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శన ఏర్పాట్లపై సింగపూర్ మంత్రి షణ్ముగం హర్షం వ్యక్తం చేశారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే ప్రపంచ ప్రసిద్ధ తిరుమల క్షేత్రంలో టిటిడి పరిపాలన, క్యూలైన్ల నిర్వహణ అత్యుత్తమంగా…
తిరుమలలో భక్తుల రద్దీ: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
పెరటాసి మాసానికి తోడు వరుస సెలవులు రావడంతో తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే లక్ష్యంతో అక్టోబర్ 1, అక్టోబర్ 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. అయితే ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే ఈ రద్దు నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అక్టోబర్ 1, 5 తేదీల బ్రేక్…
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ…
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు ముగియడం మరియు ఎస్ఎస్డీ (SSD) టోకెన్ల జారీ సాఫీగా సాగుతుండటంతో తిరుమలలో భక్తుల పెరుగుతోంది. శనివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తిరుమలకు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయి, భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. శుక్రవారం వివరాలు: క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నీరు, అల్పాహారం…
సేవా సంకల్ప అభియాన్‌లో పలు సేవా కార్యక్రమాలు
తనకల్లు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండల కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.తనకల్లు మండల బాలికల గురుకుల కళాశాలలో చిత్రలేఖనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీ తాండ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారిని శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు…

