తిరుపతి పుణ్యక్షేత్ర సమగ్ర అభివృద్ధి కోసం ‘తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (తుడా) పరిధిలో మొత్తం రూ. 3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తిరుమల కొండపై రద్దీని తగ్గించేలా కొండ కిందనే రూ. 1,332 కోట్లతో 2,700 గదుల వసతి సముదాయం, రూ. 160 కోట్లతో 6 వేల మందికి ఒకేసారి భోజన సౌకర్యం కలిగించే అన్నప్రసాద కేంద్రం, పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల పార్కింగ్ మరియు ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్‌లతో కూడిన ‘ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్’ ప్రాజెక్టును తలపెట్టారు. వీటితో పాటు టీటీడీ ఉద్యోగుల కోసం 418 ఎకరాల్లో 5,192 నివాస స్థలాల లేఅవుట్ అభివృద్ధికి రూ. 230 కోట్లు, నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు రూ. 242 కోట్లతో 9 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
రూ.3,222 కోట్లతో తిరుపతికి కొత్త కళ..అభివృద్ధికి పచ్చజెండా!

