భారత నావికాదళానికి చెందిన అత్యంత సున్నితమైన, వ్యూహాత్మక సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న పాకిస్థాన్ గూఢచర్య ముఠా గుట్టును ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం రట్టు చేసింది. “ఆపరేషన్ ఫైర్‌వాల్-2026” పేరుతో 12 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశాయి. విశాఖపట్నంలో రహస్య సమాచారాన్ని డబ్బు కోసం చేరవేసిన కాంట్రాక్టు డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్‌తో పాటు, పాక్ ఏజెంట్ వాట్సాప్ అకౌంట్ యాక్టివేషన్‌కు ఓటీపీ అందించిన కోయంబత్తూర్ ఐఎన్‌ఎస్ అగ్రణి కేంద్రంలోని నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 13 మంది నేవీ సిబ్బంది సహా మొత్తం 18 మంది అనుమానితులపై నిఘా పెట్టిన అధికారులు, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ చానెళ్ల ద్వారా సాగిన ఈ దేశద్రోహ నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’:ఏపీలో పాక్ గూఢచర్య నెట్‌వర్క్

