రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ మార్కెట్ అరంగేట్రంతోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. సుమారు రూ. 12.5 లక్షల కోట్ల (131 బిలియన్ డాలర్లు) మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించి ప్రపంచంలోనే ఆరో అత్యంత విలువైన లిస్టెడ్ టెలికాం కంపెనీగా అవతరించింది. ఆసియాలో చైనా మొబైల్ తర్వాత రెండో స్థానాన్ని కైవసం చేసుకున్న జియో, భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టింది.
దేశంలోనే అతిపెద్దదిగా నిలిచిన ఈ ఐపీవోలో షేర్ ఇష్యూ ధర రూ. 1,119 కాగా, లిస్టింగ్ రోజున ఏకంగా 21.36% ప్రీమియంతో రూ. 1,358 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. రోజు ముగిసే సమయానికి షేరు విలువ ఏకంగా 26-27% మేర లాభపడింది. మొత్తం రూ. 30,213 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో వచ్చిన ఈ ఐపీవో 22 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయింది. ఈ చారిత్రాత్మక విజయంతో, మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత భారత్‌లోనే అత్యంత విలువైన రెండో కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచింది.

