Breaking News

ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలు.. కామారెడ్డిలో సమావేశం!

రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లింగంపేట్ మండల కేంద్రంలోని జిఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో, టీఎస్ఎంసీ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో తమపై జరుగుతున్న దాడులు, కేసులను నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీల జీవనోపాధి దెబ్బతినేలా చర్యలు ఉండకూడదని, సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేతి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు నిర్జన విట్టల్ హెచ్చరించారు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ తమ పరిధికి లోబడే వైద్య సేవలు అందించాలని సభ్యులకు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *