Breaking News

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

విద్యార్థులకు అవగాహన కల్పించిన విజన్ స్వచ్ఛంద సంస్థ

ఎల్లారెడ్డి, అక్టోబర్ 26 (E6tv న్యూస్).

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని విజన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు విద్యార్థులకు సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, పీర్దోస్ మాట్లాడుతూ, విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు విద్యాభ్యాసం, కుటుంబ జీవితం, సామాజిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.మత్తు పదార్థాలను విక్రయించినా, వినియోగించినా సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకొని తమ జీవితాలను సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *