Breaking News

ఇందూరు నుంచి శబరిమలకు మహా పాదయాత్ర ప్రారంభం

పాదయాత్ర దైవ నిర్ణయం.. స్వాముల యాత్ర విజయవంతం కావాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్

ఇందూరు, అక్టోబర్ 26 (E6tv న్యూస్).

ఇందూరు నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్లడం దైవ నిర్ణయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప ఆలయంలో ఇందూరు శ్రీధర్మశాస్త్ర మహా పాదయాత్రను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములందరూ ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. అయ్యప్ప మాల ధరించి నియమ నిష్ఠలతో పాదయాత్రగా శబరిమలకు చేరుకోవడం ఎంతో పవిత్రమైనదని, అదే సమయంలో కఠినమైన ఆధ్యాత్మిక ప్రయాణమని పేర్కొన్నారు. యాత్రలో పాల్గొనే స్వాములు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.ఈ మహా పాదయాత్రలో మొత్తం 40 మంది అయ్యప్ప స్వాములు పాల్గొంటుండగా, సుమారు 45 రోజులపాటు కాలినడకన ప్రయాణించి శబరిమలకు చేరుకోనున్నట్లు తెలిపారు. స్వాముల యాత్ర సజావుగా సాగాలని, అయ్యప్ప స్వామి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గురుస్వాములు గుండయ్య, ఆగమయ్యతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్న అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *