Breaking News

తెలంగాణలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్‌సీ నోటిఫికేషన్!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్‌సీ తీపి కబురు అందించింది. ఆర్థిక, గణాంక శాఖలో ఖాళీగా ఉన్న 102 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఎంపీఎస్ఓ), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ స్పష్టం చేసింది.

ఈ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల వయోపరిమితి ఉన్నవారు అర్హులు కాగా, రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 36,750 నుంచి రూ. 1,06,990 వరకు వేతనం లభిస్తుంది. జనవరిలో ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *