హైదరాబాద్‌లోని చందానగర్ పరిధిలో ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఐదుగురు యువకుల ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ. 12 లక్షల విలువైన 4 మోటార్ సైకిళ్లతో పాటు 11 నకిలీ నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల వరుస ద్విచక్ర వాహనాల చోరీలపై ఫిర్యాదులు రావడంతో లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు పోలీసులను చూసి వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయేందుకు యత్నించగా, ఛేజ్ చేసి పట్టుకున్నారు. విచారణలో వారు దొంగిలించిన బైక్‌పై వచ్చినట్లు అంగీకరించారు.
మరింత లోతుగా విచారించగా, రాజమండ్రికి చెందిన ఐదుగురు విద్యార్థులు డిసెంబర్ 2025లో నగరానికి వచ్చి అమీర్‌పేట్‌లోని ఒక హాస్టల్‌లో ఉంటున్నారని తేలింది. వీరు రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలను చోరీ చేసి, నకిలీ నంబర్ ప్లేట్లు తగించి రాజమండ్రిలోని తెలిసిన వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అక్టోబర్ 25న చందానగర్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను కూడా ఈ ముఠాయే దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు.

