Breaking News

అమిత్‌ షా రాకతో బీజేపీ మహా పాదయాత్ర షెడ్యూల్ మార్పు?

హైదరాబాద్‌లో నవంబర్‌ 2న నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్ర వేదిక, రూట్‌ విషయంలో పార్టీ నాయకత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. తొలుత ట్యాంక్‌బండ్‌ నుంచి పాదయాత్ర చేపట్టాలని భావించినప్పటికీ, ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో వేదికను మార్చే యోచనలో ఉంది. భద్రతా కారణాలతో పాటు భారీగా తరలివచ్చే కార్యకర్తలకు అనుగుణంగా పాదయాత్రతో పాటూ బహిరంగ సభను కూడా నిర్వహించేందుకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నారు.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్‌, ‘ఇండియా’ కూటమి చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌ రావు నేతృత్వంలో ఈ మహా పాదయాత్రను చేపట్టనున్నారు. అమిత్‌ షా రాకతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, యాత్ర ప్రారంభ ప్రాంతం, మార్గం మరియు సభ వేదికపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *