Breaking News

స్థానిక పోరు: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ !

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గురువారం ప్రారంభమైంది. ఈ ఓటింగ్ ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బందితో పాటు దూర ప్రాంతాల్లో ఉండే అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటింగ్ పారదర్శకంగా జరిగేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టిన అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి వార్డుకు ఒక రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), ఇద్దరు సహాయకులను నియమించారు. రెండు రోజుల ఓటింగ్ పూర్తయిన వెంటనే ఈ బ్యాలెట్ బాక్సులను భద్రంగా స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *