Breaking News

దర్శకుడిగా మారుతున్న రాహుల్ రామకృష్ణ!

‘అర్జున్ రెడ్డి’, ‘జాతిరత్నాలు’ చిత్రాలతో తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నారు. నటుడిగా మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో నటిస్తున్న ‘హుషారు-2’ చిత్రం పూర్తయిన వెంటనే తన కొత్త సినిమాను ప్రారంభిస్తానని వెల్లడించారు.

వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని, ఇది పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే ఆయనే సమకూర్చగా, నటీనటుల ఎంపిక కూడా ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. కెరీర్ ప్రారంభం నుంచి పదేపదే ఒకే రకమైన హీరో ఫ్రెండ్ పాత్రలే రావడం వల్ల కొంత అసంతృప్తికి గురయ్యానని, అందుకే దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *