Chithoor
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ప్రజల వినతులను ఓపికగా విన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్…
ధర్మవరం పర్యటనలో మంత్రి సత్యకుమార్ యాదవ్
సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ధర్మవరం, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం పర్యటన వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు, ఎన్డీఏ కూటమి నాయకులు,…
రైతన్న కంట కన్నీరు.. బత్తలపల్లిలో కరువు కష్టాలు
అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న వేల ఎకరాల ఉద్యాన పంటలు కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ బత్తలపల్లి, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కే. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దేవరగుడి జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఉద్యానవన రైతులు తీవ్ర…
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ
పుట్టపర్తి, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. శ్రీ వినాయకుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి…
మెల్బోర్న్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ కో-ఆర్డినేటర్ల ఆత్మీయ భేటీ!
మెల్బోర్న్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ కో-ఆర్డినేటర్ల ఘన స్వాగతం.. ఏపీ కూటమి ప్రభుత్వానికి ఎన్‌ఆర్‌ఐల ‘మెగా’ మద్దతు!మెల్బోర్న్ (ఆస్ట్రేలియా):ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం ప్రవాసాంధ్రుల కోలాహలంతో సందడిగా మారింది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నూతనంగా నియమించిన ఏపీఎన్‌ఆర్‌టీ (APNRT) కో-ఆర్డినేటర్ల ఆత్మీయ సమావేశం ఇక్కడ అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.కేక్ కట్ చేసి సంబరాలు.. శాలువాలతో సత్కారం!నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కో-ఆర్డినేటర్లందరూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పదవులు పొందిన ప్రతినిధులందరినీ…
శ్రమజీవులకు సీఎం చంద్రబాబు వందనం.. ప్రగతి రథ చక్రాలకు కార్మికులే ఇంధనం!
వాయిస్ ఓవర్:అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కార్మిక, కర్షక లోకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ నిర్మాణంలో శ్రామికుల పాత్ర వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు.వార్తలోని ముఖ్యాంశాలు:శ్రమకు గౌరవం: వృత్తి ఏదైనా.. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం దక్కాలని, అది మనందరి బాధ్యత అని సీఎం పేర్కొన్నారు.అన్నదాతే ఆధారం: దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయ రంగం ఇంతలా రాణిస్తోందంటే, అది రైతులు మరియు రైతు…

